Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Personality Development Add to Wishlist  |  Share       


ఆనందం  (Anandam)
N.Surya kumari
Publisher: Sambhodhi publications
Availability: In Stock
INR 120


ఆనందమంటే ఏమిటి? ఆ సంగతి గ్రహిస్తే మనిషి ప్రతిక్షణం పరవశంగా జీవించవచ్చు. ఆనందాన్ని అందుకోడానికి ముందు మనిషి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని వున్నాయి. వాటి అవగాహన కలిగితే ఆనందం మనముందుంటుంది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయాల్ని ఓషో ఈ గ్రంథంలో ఆసక్తిగా వివరించారు. మొదట మనం అర్థం చేసుకోవాల్సింది దు:ఖం. దాన్ని గురించి చెబుతూ నీ దు:ఖాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అనుభవించు. దానిలొతుల్లోకి వెళ్ళు. అది ఎందుకుందో కారణం కనిపెట్టు. ఈ అర్థం చెసుకోవడమే ధ్యానం. అప్పుడే దాన్నించి నువ్వు బయటపడతావు అంటాడు ఓషో. అట్లాగే నీ సంతృప్తిని కూడా అర్థం చేసుకో. నీ సంతోషాన్ని కూడా అర్థం చేసుకో. అది ఎంతో బాహ్యమైందో అర్థమవుతుంది అంటాడు. ఆనందానికి, వినోదానికి తేడా గ్రహించమంటాడు. ఇంకా పరమానందం కోసం వెతుకు. ఆ వెతుకులాటలో సుఖాన్నే పరమానందమనుకోకు. సుఖానుభవం పశుత్వం, సంతోషం మానవ లక్షణం, పరమానందం దైవ లక్షణమంటూ వాటి మధ్య తేడాల్ని వివరిస్తాడు. అసలు సంతోషమన్నది యితరులపై ఆధారపడి వుండదని, అది మన సహజ లక్షణమని ఐతే పరమానందమన్నది వేరని అది ఎవరిపైనా ఆధారపడివుండదని సూక్ష్మ వివరణలిస్తాడు. ఆనందమంటే ఏమిటో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తప్పక చదవాల్సిన గ్రంథమిది.






Other Titles of Interest



Customers Who Also Bought