Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Personality Development Add to Wishlist  |  Share       


అవేర్ నెస్  (Awareness)
Veeta asmi
Publisher: Sambhodhi publications
Availability: In Stock
INR 130


అన్ని ధ్యాన మార్గాల్లో, అన్ని కళల్లో నిగూఢంగా వున్న రహస్యం ఈ క్షణం స్పృహతో వుండడం, చైతన్యంతో వుండడం. అవేర్ నెస్ అంటే అదే. మెలుకువ, జాగృతి అన్న మాటలు కూడా అవేర్ నెస్ కు అన్వయించవచ్చు. మనం మెలుకువతో వుంటే జీవితంలో అనుక్షణం మనపై మనం అధికారం కలిగివుంటాం. బుద్ధుడు మొదలైన వాళ్ళ దృష్టిలో ప్రపంచంలో అధిక సంఖ్యాకులు నిద్రలో నడుస్తూ జీవితాల్ని గడుపుతున్నారు. మనల్ని ఏవి ప్రేరేపిస్తున్నాయి? ఏవి మనల్ని నడిపిస్తున్నాయి? అన్న స్పృహ లేకుండా జీవిస్తూ వుంటాం. కానీ ఎప్పుడో మనం మేలుకుని వుండే లక్షణాలు కూడా జీవితంలో వుంటాయి. ప్రమాదాలు ఎదురైనపుడు స్పృహతో వుంటాం. ఆత్మీయుల్ని కలుసుకున్నప్పుడు ప్రతి కదలికలో, ఆలోచనలో మెలుకువతో వుంటాం. మన జీవితంలోని ప్రతి క్షణం స్వేచ్ఛగా, స్వీయ నిర్ణయాలతో నిలిచే రహస్యాన్ని ఓషో 'అవేర్ నెస్ ' అంటాడు. మనం జీవితం పట్ల ఆసక్తితో, ధ్యానంతో, ప్రేమతో ఎట్లా వుండాలో 'ఈ అవేర్ నెస్ ' పుస్తకంలో చెప్పాడు. ఆహ్లాదంగా, మనోహరంగా మనల్ని మేల్కొలిపే గ్రంథం ఇది. 'మావీతరస్మి ' అద్భుత అనువాదం మనల్ని చదివిస్తుంది.






Other Titles of Interest



Customers Who Also Bought