Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Spiritual and Devotional Add to Wishlist  |  Share       


నిగూఢ రహస్యాలు  (Niguda Rahasyalu)
N.Surya kumari
Publisher: Sambhodhi publications
Availability: In Stock
INR 150


ఓషో బహుముఖ జ్ఞానంలో భారతీయ సంస్కృతికి సంబంధించిన బలమైన పునాదులున్నాయి. ఆధ్యాత్మిక రంగానికి ఆదిమ బీజాలు ఈ దేశంలోనే పడ్డాయంటాడాయన. ఆలయాలు, ఆరాధనలు, మంత్రాలు వీటన్నిటి వెనుక గొప్ప వుద్దేశాలున్నాయని వాటి రహస్యాల్ని వివరించాడు. దేవాలయ రహస్యాలు, తీర్థయాత్రల పరమార్థం, జ్యొతిశ్శాస్త్ర, విశేషాల్ని ఇందులో విపులంగా వివరించాడు. దైవం గురించి అనుభవం లేకుండా దేవాలయాల్ని నిర్మించడం అసంభవమంటూ మనకు తెలియని మహారహస్యాల్ని 'నిగూఢ రహస్యాల 'లన్న ఈ గ్రంథంలో వివరించారు. అంతరిక్ష తరంగాలు మానవ ఆత్మని తాకి ఆలయాల్ని ఆవిష్కరించాయని, ఒకప్పుడు దేవాలయాలు గ్రహణ సామర్థ్యాన్ని కలిగిన పరికరాలుగా వుండేవని మనను దిగ్భ్రమకి లోను చేస్తాడు. తీర్థయాత్రా స్థలాల రూపాంతర సంయోగం గురించి వివరిస్తూ ఈస్టర్ దీవిలోని విగ్రహాలు, మక్కాలోని కాలా మొదలైన వాటి రహస్యాల్ని ఆవిష్కరించారు. జ్యొతిశ్శాస్త్రం ఎంత గొప్పదో మనషికి నక్షత్రాల్తో ఉన్న సంబంధం ఎంత బలీయమైందో వివరించారు. ఇట్లా ఎన్నో రహస్యాల్ని వివరిస్తూ రసవంతంగా సాగే గ్రంథమిది. డాక్టర్ ఎన్.సూర్య కుమారి గారి సరళమైన అనువాదం పఠనయోగ్యంగా వుంది.






Other Titles of Interest



Customers Who Also Bought