Login   |  My Wishlist   |  Track Your Order  |  My Cart



HomeCategoriesNew ArrivalsNew AdditionsEnglish BooksTop RecommendationsBest SellersCD/DVDRequest a Book

Home > Categories > Spiritual and Devotional Add to Wishlist  |  Share       


భగవాన్ బుద్ధ  (Bhagawan Buddha)
Sri Sarvari
Publisher: Master Yoga Ashram
Availability: In Stock
INR 200


సిద్ధార్థుడు జన్మించి 2550 సంవత్సరాలైంది. గౌతమ బుద్ధుని పేరు వినని వారుండరు. తెలియని ప్రపంచం ఉండదు. బుద్ధుని స్మరణం నిత్యావసరం. ప్రేమ, కరుణ ఉన్నంతకాలం బుద్ధుడు ఉన్నట్లే. దేశానికి దేశానికి దేవుళ్ళు మారుతుంటారు. కాలానికి కాలానికి మతాలు మారుతుంటాయి. నాటికి నేటికి మారనిది మానవత్వం. మానవతకు మతం నీడ అవసరం లేదని, కులం ఆసరా అసలు అవసరం లేదని ఎలుగెత్తి చెప్పినవాడు బుద్ధుడు. వేదాల నీడలో మనుగడ సాగించలేక బోధి నీడను ఆశ్రయించి బుద్ధుడు అయ్యాడు. ధ్యానం పండించుకొని జ్ఞానీ అయ్యాడు. బౌద్ధాన్ని విశ్వవ్యాప్తం చేసి తధాగతుడు అయ్యాడు. భగవాన్ బుద్ధ అభిమానించింది మానవతను. ప్రేమించింది మానవత్వాన్ని.ఆరాధించింది హృదయధర్మాన్ని. బుద్ధుని సందేశాల సమాహారం ' భగవాన్ బుద్ధ' . “భగవాన్ బుద్ధ'' చరిత్ర చదివితే ధ్యానం కుదురుతుంది.






Other Titles of Interest



Other Titles by Same Author/Publisher